AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ మంత్రి బంధువులపై చీటింగ్ కేసు.. ఏం జరిగిందంటే

మాజీ మంత్రి బంధువులపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తమ ప్రాపర్టీలో మాజీ మంత్రి బంధువులు అక్రమంగా వచ్చి ఉంటున్నారంటూ బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి బంధువులపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు అయ్యింది. దండు లచ్చిరాజు అనే వ్యక్తికి మియాపూర్‌లో ఐదు అంతస్థుల ప్రాపర్టీ ఉంది. అయితే మాజీ మంత్రి బంధువులు అక్రమంగా ఆక్రమించుకుని అక్కడే ఉంటున్నారని సదరు బాధితుడు వాపోయాడు.

తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు తన ప్రాపర్టీని ఆక్రమించారని బాధితుడు దండులచ్చిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్‌ పేరుతో ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్‌కు పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ANN TOP 10