AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరద బాధితులకు గుడ్ న్యూస్.. మరో రెండ్రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10వేలు..

తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి ప్రజలు, రైతులు నష్టపోయారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు మరో రెండ్రోజుల్లో రైతన్నలకు డబ్బులు అందజేయనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

రెండ్రోజుల్లో..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..”భారీ వర్షాల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా రైతులు బాగా దెబ్బతిన్నారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా.. ఇంతవరకూ ఒక్క రూపాయీ రాలేదు. మునిగిన పంట పొలాలకు ఎకరానికి పది వేలు ఇస్తామని చెప్పాం. రెండ్రోజుల్లో రైతులకు పంట పరిహారం కింద మొదటి విడతగా రూ.10వేలు ఇస్తాం. సాగర్ కాలువ నాలుగు చోట్ల తెగింది. పాలేరు దిగువన ఉన్న రైతులందరికీ రేపటి కల్లా నీటిని అందిస్తాం. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల దోచుకున్నారు. గతంలో పంట నష్టం జరిగితే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిహారం ఇచ్చాం. రైతుల పట్ల BRS ప్రభుత్వం కపట ప్రేమ చూపించింది. రుణమాఫీ రూ.14వేల కోట్లు ఉంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు వారికి లేదు.

ANN TOP 10