AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసుల పిటిషన్

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను తమ కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని హైదరాబాద్‌కు తరలించి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

తాజాగా, నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత… కోర్టులో హాజరుపరచడానికి ముందు కూడా పోలీసులు అతనిని విచారించారు. అయితే మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

ANN TOP 10