AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ ఎక్కడ? ఫాంహౌస్‌లో పండుకున్నారా?.. వరదలపై స్పందించరేం

ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలమైనప్పటికి మాజీ సీఎం కేసీఆర్‌ ఎక్కడ ఉన్నారని? ఎందుకు కనిపించడం లేదని.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో కేసీఆర్‌ కనిపించడం లేదని.. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

ఇదే కేసీఆర్‌ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడిన గందరగోళ పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని.. ఆయన చెప్పుకొచ్చారు. భారీ వర్షాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఎప్పటికప్పడు సమీక్షిస్తూ.. అధికారులతో చర్చిస్తూ.. పరిస్థితులను ఆరా తీస్తున్నారన్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్‌ కు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా.. అన్ని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

ANN TOP 10