AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి పొంగులేటికి గాయాలు.. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఘటన

టూ వీలర్‌ స్కిడ్‌
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఖమ్మం మండలంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎడమ కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన మండల పరిధిలోని జలగం నగర్, కేబీఆర్‌ నగర్, టెంపుల్‌ సిటీ, నాయుడుపేట వరద ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం పొంగులేటి ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ కాలనీలోని వరద బాధితులను పరామర్శించడానికి టు వీలర్‌పై వెళ్లారు. ఈ క్రమంలోనే కాలనీలో బండి ఒక్కసారిగా స్కిడ్‌ అయి జారి పడ్డారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్‌ ఆఫీస్‌కు తరలించారు. జిల్లా ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర గౌడ్‌ ఆయనకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు.

ANN TOP 10