AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్.. త‌క్ష‌ణ సాయం చేస్తామ‌ని హామీ

బంగాళా ఖాతంలో అల్ప‌పీడనం తీవ్ర వాయుగుండంగా మార‌డం.. ‘అస్నా’ తుఫాన్(Asna Cyclone) కార‌ణంగా భారీ వ‌ర్షాల‌తో తెలుగు రాష్ట్రాల్లోని జ‌లాశ‌యాల‌కు వ‌ర‌ద నీరు పోటెత్తుతోంది. ఇప్ప‌టికే ప‌లుచోట్ల కొంద‌రు గ‌ల్లంత‌య్యారు. వ‌ర‌ద నీరు ఇండ్ల‌లోకి రావ‌డంతో పాటు ప‌లు చోట్ల రోడ్డులు తెగిపోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు భ‌య‌పెడుతున్నాయి. దాంతో, రెండు రాష్ట్రాల్లోని ప‌రిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  ఆరా తీశారు.

తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయ‌డుల‌కు ఆయ‌న ఫోన్ చేశారు. త‌క్ష‌ణ‌మే అవ‌స‌ర‌మైన సాయం అందిస్తామ‌ని ఆయ‌న ఇద్ద‌రు సీఎంల‌కు హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రేవంత్ రెడ్డి షాకు వివ‌రించారు.

ANN TOP 10