AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘స్పీడ్‌’ పెంచండి.. 19 ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ సమీక్ష

సీఎంను ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు

(అమ్మన్యూస్, హైదారాబాద్‌):
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో స్మార్ట్‌ ప్రోయాక్టివ్‌ ఎఫిషియెంట్‌ అండ్‌ ఎపెక్టివ్‌ డెలివరీ(స్పీడ్‌) 19 ప్రాజెక్టులపై రూపొందించిన కార్యచరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ’స్పీడ్‌’ ప్రాజెక్టులో భాగమైన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షకు సీఎస్‌ శాంతికుమారితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రమేశ్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్‌ టూరిజం అభివృద్ధిపై సీఎం ఈ సందర్భంగా చర్చించారు.

వేములవాడ ఆలయ అర్చకుల ఆశీర్వచనం:
వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్‌ లో రూ.50 కోట్లు కేటాయించిన నేపథ్యంలో శుక్రవారం సీఎం రేంత్‌ రెడ్డిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్, వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఈ భేటీలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10