AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో డ్రైవర్ లెస్ కారు.. అందులో మొదటగా ప్రయాణించిన మంత్రి శ్రీధర్ బాబు

ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అక్కడ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. అనంతరం తన అనుభూతిని తెలియపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఇప్పుడెందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు.

సోమవారం ఆయన కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత కారును పరిశీలించారు. అనంతరం అందులో కొంతదూరం ప్రయాణించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రైవర్ లెస్ కారు అద్భుతంగా ఉందన్నారు. దీనిని రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ దేశానికే గర్వకారణమన్నారు. అయితే, ప్రయోగ దశలో ఉన్న ఈ డ్రైవర్ లెస్ సాంకేతికత త్వరలోనే ఆచరణలోనికి రావాలంటూ మంత్రి ఆకాంక్షించారు. ఏఐ సేవలను అన్ని రంగాల్లోనూ వినియోగించుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ANN TOP 10