AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు- మంత్రి తుమ్మల

బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అధికారంలో ఉండగా ఏనాడు రైతులను పట్టించుకోలేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

”అధికారం కోల్పోయిన వారు ఏమైనా మాట్లాడొచ్చు. కానీ రైతులను మోసం చేయకూడదు. రైతులను దగా చేసిన మీరు నేడు వారి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంటకు రుణమాఫీ చేశాం. రూ.31 వేల కోట్ల కేటాయింపు కష్టమే అయినా ఒకే పంట కాలంలో రైతుల ఖాతాలో జమ చేశాం. ఆగస్టు 15 లోపు 2లక్షల రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పాం. జూలై 15న జీవో ఇచ్చాం, ఆగస్టు 15లోపు చేశాం. బ్యాంకు తప్పిదాలు, ఆధార్ తప్పులు, రుణమాఫీ కానీ వారి ఇంటికి వెళ్ళి మాఫీ చేయాలని చెప్పాం. ఆ ప్రక్రియ షూరూ చేశాం.

రుణమాఫీ కానీ వారు మండల వ్యవసాయ అధికారి, రైతు వేదిక వద్దకి వెళ్ళాలి. గతంలో లాగానే రుణమాఫీ చేస్తున్నాం. అధికారం పోయిందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వెళ్ళి బ్యాంకులను అడగండి. రూ.31 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశాం. ఆగస్టు 15 లోపు 2లక్షలు వరకు చేస్తాం. మిగిలినవి షెడ్యూల్ ప్రకారం మాఫీ చేస్తాం. ఆగస్టు 15 లోపు 18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. ఒకే నెలలో పంట రుణమాఫీ చేశాం. దేశంలో ఒక చారిత్రక ఘటన. అధికారం వస్తుంది. పోతుంది.. రైతులను ఆందోళన గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటే మీ చరిత్ర వెంటాడుతుందన్నారు మంత్రి తుమ్మల.

ANN TOP 10