ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో, 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతుందని MEA కార్యదర్శి (వెస్ట్) తన్మయ లాల్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపారు.









