అమ్మన్యూస్ ఆదిలాబాద్ : రైతుల పొట్టకొట్టాలని చూస్తే పుట్టగతులుండవని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సూచించారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి . ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ గ్రామంలో జరిగిన భారీ చేరికల కార్యక్రమానికి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి జిల్లా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు వారికి డప్పు చప్పుళ్లతో పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.ముందుగా గ్రామంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభి , పార్టీ జెండాని ఆవిష్కరించారు. గ్రామంలోని శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అదిలాబాద్ రూరల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు,పద్మశాలి చేనేత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు అల్చేట్టి నాగన్న తన అనుచర గణంతో కాంగ్రెస్ గూటికిచేరారు. కొట్నాక తిరుపతి తో కలిసి కంది శ్రీనివాస రెడ్డి ఆయన కు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఆయనతో పాటు యాపల్ గూడ , యశ్వంత్ గూడ,మత్తడి గూడ,కొత్త గూడ,రాముల గూడ గ్రామస్తులు బీఆర్ఎస్,బీజేపీల నుండి దాదాపు ఐదువందల మంది కంది శ్రీనివాస రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికి కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ..యాపల్ గూడ ముద్దుబిడ్డ అల్చెట్టి నాగన్న పార్టీలోకి రావడం మంచి పరిణామమన్నారు. అలాంటి నిస్వార్ధ నాయకుడు పార్టీకి బలమన్నారు.ప్రజల గురించే తప్ప తన స్వార్ధం గురించి ఆలోచించని మంచి మనిషని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల కోసం పని చేసే పార్టీ అన్నారు. పేదల పార్టీ వారి కోసమే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చి పేద ప్రజలకు అండగా నిలబడందన్నారు.
కాంగ్రెస్ పార్టీ గరీబోళ్లకు ఇండ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామంలో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డుల సమస్య పరిష్కారం త్వరలో జరగుతుందన్నారు. అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం అర్హులకు కొత్త కార్డులు ఇస్తుందన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తుందని ,ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 31 వేల కోట్లతో రైతురుణమాఫీ చేసిన ఘనత సీయం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ విషయమన్నారు.
నాది ఒంటరి పోరాటం
గత అసెంబ్లీ ఎన్నికల్లో తను ఒంటరి పోరాటం చేసినా..మీరందరూ 50వేల ఓట్లతో ఆశీర్వదించారని ఇందుకు ఓటేసిన అందరికి రుణ పడి ఉన్నానన్నారు. తన మీద అభిమానంతో గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రానన్ని ఓట్లు తనకు వేసారని గుర్తు చేసారు. తను ఒక సాధారణ వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టానని ,ఇక్కడే పుట్టి అమెరికాలో చదివి ఉద్యోగం చేశానన్నారు.అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి దేవుడి దయ వల్ల బాగానే సంపాదించానని తెలిపారు. తను సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదని ప్రజా సేవ కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తను ఓడిపోతే ఇక్కడ ఉండనని కొందరు పని గట్టుకొని ప్రచారం చేసి తన ఓటమికి కారణమయ్యారని తను ఓడిన ఇక్కడే ఉంటానన్నారు. ప్రజల మధ్య నే ఉంటా ప్రజల కోసమే బతుకుతానన్నారు. తన సంపాదనలో సగం ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే ఖర్చు పెడతానని మరోమారు ప్రకటించారు. ఇలాంటి నాయకులు అనాడు తన వెంట ఉంటే తప్పకుండా గెలిచే వాడినని తెలిపారు. గత ఎమ్మెల్యే జోగురామన్న లంచాలు తీసుకొని బదిలీలు జరిపించేవాడని కాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో బదిలీలు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు.
ఒక్క రైతుపై చేయిపడినా సహించం
యాపల్ గూడ రైతులను పాయల్ శంకర్ బెదిరించడం దుర్మార్గచర్యగా కంది శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. ప్రజా ఓట్లతో గెలిచిన పాయల్ శంకర్ కు గర్వం పెరిగిందని అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.రేణుక సిమెంట్ ఫ్యాక్టరీలో భూములకు యాపల్ గూడ రైతులు నష్టపరిహారం అడిగితే తాళ్లతో కట్టేసి లాక్కుంటామని బెదిరించడం దేనికి సంకేతమన్నారు. రైతుకు కులం మతం లేదని ఏ కులమైనా రైతు రైతేనని అని తేల్చి చెప్పారు. ఒక్క రైతుపై చేయి పడినా ఊరుకునేది లేదన్నారు. రైతుల జోలికి కానీ కాంగ్రెస్ కార్యకర్తల జోలికి కానీ వస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రైతుల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధిగా వీలయితే రైతులకు మంచి పనులు చేయాలే గాని నమ్మి గెలిపించిన రైతుల నోట్లో మట్టి కొట్టరాదని సూచించారు. రైతుల పొట్ట కొడితే పుట్టగతులు ఉండవన్నారు.
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కలిసి పని చేద్దాం
త్వరలో పంచాయతీ , ప్రాదేశిక ఎన్నికలు రానున్నాయని ఇలాంటి చేరికల వల్ల పార్టీ మరింత బలోపేతమయి గెలుపు సులువవుతుందన్నారు. కాని దేన్ని లైట్ గా తీసుకోవద్దని గెలిచే దాకా విశ్రమించ వద్దన్నారు. వచ్చే ఎన్నికలేవైనా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా ప్రతీ నాయకుడు కార్యకర్త కష్టపడాలన్నారు. రానున్న పంచాయతీ ,ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటాలని గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,లోక ప్రవీణ్ రెడ్డి,షేక్ ఖలీద్ , బొమ్మకంటి రమేష్,బూర్ల శంకరయ్య, బండి దేవిదాస్ చారి,సుధాకర్ గౌడ్,యెల్టీ భోజా రెడ్డి ,పోరెడ్డి కిషన్,,సింగిరెడ్డి రామ్ రెడ్డి,ఎం.ఏ షకీల్,జాఫర్ అహ్మద్ ,అరిగేల కిష్టయ్య,అయిటి నర్సింగ్, భూమయ్య,అనుముల ఉదయ్ కిరణ్,గోల్కొండ రాందాస్,తోన్పుల నందు,అనుముల సాగర్,సార్ల సత్యనారాయణ,పట్టేపు సురేష్,మంచాల మల్లయ్య,మంచాల పోతన్న,పెందూర్ మోహన్,తానాజీ,బడాల రాజా రెడ్డి,మోర ఆశన్న,బాసా సంతోష్,,తమ్మల చందు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.









