AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలుగు రోజులు మోస్తరు వానలు

వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 15 వరకు ఇదే విధమైన వాతావరణం నెలకొంటుందని ప్రత్యేక వాతావరణ బులెటిన్‌లో ప్రకటించింది. రాగల 24 గంటలకు ఏడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. మరో పది జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రజలు ఎండ, ఉక్కపోత నుంచి కాస్త ఊరట పొందుతున్నారు.

ANN TOP 10