AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాకు 15 సెక‌న్లు చాలు.. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

అమ్మన్యూస్, హైదరాబాద్ :
15 నిమిషాల పాటు పోలీసుల్ని తొల‌గిస్తే, మేం ఏం చేస్తామో చేసి చూపిస్తామ‌ని 11 ఏళ్ల క్రితం ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ ఓ సంద‌ర్భంలో వార్నింగ్ ఇచ్చారు. అయితే హిందువుల‌ను ఉద్దేశించి ఆయ‌న వార్నింగ్ ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక ఆ వ్యాఖ్య‌ల‌కు ఇప్పుడు బీజేపీ నేత న‌వ‌నీత్ రాణా( Navneet Rana) కౌంట‌ర్ ఇచ్చారు. హైద‌రాబాద్ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీ ల‌త త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న ఆమె మాట్లాడుతూ.. 15 నిమిషాలు కాదు.. త‌మ‌కు 15 సెక్ష‌న్లు స‌రిపోతుంద‌ని న‌వ‌నీత్ రాణా అన్నారు. హైద‌రాబాద్‌ను పాకిస్థాన్‌గా మార్చ‌కుండా ఉండేందుకు మాధ‌వీ ల‌త అడ్డుకుంటుంద‌ని కూడా రాణా అన్నారు. కాంగ్రెస్‌కు కానీ ఎంఐఎంకు కానీ ఓటేస్తే, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఓటేసిన‌ట్లు అవుతుంద‌ని న‌వ‌నీత్ అన్నారు. 39 సెక‌న్ల వీడియోను రాణా త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టును ఓవైసీ సోద‌రుల‌కు కూడా ట్యాగ్ చేశారు.

15 సెకన్లలో ఒవైసీ బ్రదర్స్‌ అడ్రస్ లేకుండా చేస్తానని హైదరాబాద్ బ్రదర్స్ కు బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ ఒవైసీ బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ గతంలో 15 నిమిషాల్లో తరమికొడతామంటూ అక్బరుద్దీన్ చేసిన కామెంట్లకు ఆమె కౌంటరిచ్చారు. 15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామంటూ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మరో పాకిస్థాన్ కావొద్దు.. అలా కాకుండా ఉండాలంటే బీజేపీ అభ్యర్థి మాధవీలతను గెలిపించాలన్నారు నవనీత్ కౌర్.

న‌వ‌నీత్ రాణా చేసిన కామెంట్‌కు ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కౌంట‌ర్ ఇచ్చారు. న‌వ‌నీత్ రాణాకు 15 సెక‌న్ల స‌మ‌యం ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీని కోరుతున్న‌ట్లు చెప్పారు. ఆమె ఏం చేస్తుంది, 15 సెక‌న్లు కాదు, గంట ఇవ్వండి, వాళ్లు ఏం చేస్తారో మాకు కూడా చూడాల‌ని ఉంద‌ని, ఇక్క‌డేమైనా మాన‌వ‌త్వం మిగిలి ఉందా, ఎవ‌రూ భ‌య‌ప‌డేది లేదు, మిమ్మ‌ల్ని ఎవ‌రూ అడ్డుకోవ‌డం లేద‌ని అస‌ద్ అన్నారు.

ANN TOP 10