AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది జోరు.. సుగుణ గెలుపు హోరు.. మండుటెండల్లో.. తిరుగులేని ప్రచారం

ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జయకేతన ఖాయమని ధీమా

ఊరూరా.. జనజాతర

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో ముందంజ

బూత్ స్థాయి నుండి ప్రతీ వ్యవస్థ పటిష్టం

తీవ్రంగా కష్టపడుతున్న కార్యకర్తలు

స్ఫూర్తినింపుతూ.. సారధిగా సాగుతున్న యువనేత

ప్రచారానికి అడుగడుగునా ఆదరణ

కాంగ్రెస్ సర్కారుకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేస్తున్న ప్రజలు

ప్రచారంలో తేలిపోతున్న భాజపా, భారసా

(అమ్మన్యూస్ ప్రత్యేక ప్రతినిధి, ఆదిలాబాద్)
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో తీవ్రంగా కష్టపడుతూ క్యాడర్ ను ప్రచారంలో పరుగెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీవెనలు, మంత్రి సీతక్క సూచనలతో క్షేత్రంలో దుమ్మురేపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మించి బూత్ స్థాయిలో పక్కాప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారు. భారీ చేరికలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపాలన, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, మంత్రి సీతక్క ఇమేజ్, అభ్యర్ధిగా ఆత్రం సుగుణ క్లీన్ ఇమేజ్ అన్నీ కాంగ్రెస్ కు కలిసొస్తున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుండగా, ఆదిలాబాద్ అసెంబ్లీ నిఓజకవర్గంలోనూ బంపర్ మెజారిటీ సాధించేదిశగా కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. కాంగ్రెస్ క్యాడర్ గతంలో ఏ ఎన్నికలో కష్టపడని రీతిలో.. ముందుకు సాగుతున్నారు. మంత్రి సీతక్క సూచనలు తీసుకుంటూ.. కందిశ్రీనివాసరెడ్డి గ్రామాలు, వార్డులు అన్నీ చుట్టేస్తున్నారు.


వ్యూహాత్మకంగా..

45 డిగ్రీల ఎండలో కూడా ఇక్కడ కార్యకర్తలు సూర్యుడినే భయపెట్టేలా దుమ్ములేపే ప్రచారం నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఎవరికి వారు సత్తాచాటేలా శ్రమిస్తున్నారు. జూన్ లోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. క్యాడర్ ప్రతీ గ్రామంలో ప్రతీ బూత్ లో లీడ్ తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. యువనేత కంది శ్రీనివాసరెడ్డి నాయకులు, క్యాడర్ లో అనుక్షణం స్ఫూర్తినింపుతూ చేస్తున్న కార్యక్రమాలు పార్టీని పటిష్టం చేశాయి. క్యాడర్ లో పరవళ్ళు తొక్కే ఉత్సాహాన్ని నింపాయి. ఆదిలాబాద్ టౌన్, రూరల్, బేల, జైనథ్, మావల అన్నిచోట్లా.. ఒకే స్పందన.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా పరిస్థితి ఉందని నేతలు అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగ్గా, మంత్రి సీతక్క , అభ్యర్ధి సుగుణ గ్రామాల్లోనూ పర్యటించి క్యాడర్ లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్ సంక్షేమపాలనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా అధైర్యపడకుండా.. వెంటనే పార్టీపటిష్టతపై ఫోకస్ చేసి జరిపిన నిర్మాణం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అద్భుతశక్తిగా మలిచింది. రాష్ట్రవ్యాప్గంగా బిఆర్ఎస్ కుప్పకూలగా, ఆదిలాబాద్ లోనూ అదే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంలో కంది శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. మైనారిటీల ఆత్మవిశ్వాసం గెలవడంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవాభవన్ ద్వారా, తన కార్యక్రమాల ద్వారా ఆదిలాబాద్ భవిష్యత్ కు కంది శ్రీనివాసరెడ్డి ఓ భరోసాగా నిలుస్తున్నారు. మంత్రి సీతక్క ద్వారా, ఎంపీ అభ్యర్ది సుగుణ ద్వారా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ప్రగతితిపథంలో నిలుపుతామని భరోసానిస్తున్నారు. మండుటెండల్లో సూర్యునితో పోటీపడుతూ ప్రతీరోజూ 18గంటలకు పైగా కష్టపడుతూ కాంగ్రెస్ గెలుపుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. పార్టీ ఇన్ ఛార్జిదీపాదాస్ మున్షీ, ఎఐసిసి ఇన్ ఛార్జి విష్ణునాద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రధానకార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి సత్తుమల్లేష్ సూచనలతో నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. కాంగ్రెస్ ను విజయపథంలో నిలిపేందుకు పనిచేస్తున్నారు.

ANN TOP 10