AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్ కస్టడీ పొడిగించారు. మరో వారం రోజులు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం.. కస్టడీని మే 14వ తేదీ వరకు పొడిగించింది. ఇక సోమవారం కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లు కోర్టు తిరస్కరించింది కూడా. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు.

ANN TOP 10