ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ముంబై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అభేద్యమైన నాలుగో వికెట్ కే ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును విజయ తీరానికి చేర్చారు. సూర్యకుమార్ సెంచరీ (51 బంతుల్లో 102, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) చేయగా, తిలక్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో, కమిన్స్ తలో వికెట్ తీశారు. కాగా హైదరాబాద్ ఓటమితో ఇప్పుడు ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.









