AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వడదెబ్బ ఎఫెక్ట్.. 2 టన్నుల చేపలు మృత్యువాత

మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టపడి నీటి వనరు ఏర్పాటు చేశామని మత్స్యకారులు పేర్కొన్నారు. అయినా లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వడదెబ్బ కారణంగా రెండు టన్నుల చేపలు మృత్యువాత పడినట్లు వారు పేర్కొన్నారు. ఒకేసారి రెండు టన్నుల చేపలు చనిపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించిందని వాపోయారు.

ANN TOP 10