AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీని నమ్మి 400 సీట్లిస్తే.. పెట్రోల్‌ ధర రూ.400 చేరవచ్చు..?

పెట్రోల్‌ ధరలతో కాషాయపార్టీ ఇప్పటికే నడ్డి విరుస్తున్నదని, ‘అబ్‌ కా బార్‌.. చార్‌ సౌ పార్‌’ అంటున్న బీజేపీని నమ్మి ఓటేస్తే ఇగ ఆగమేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. వాళ్లు చార్‌ సౌ అనేది సీట్ల గురించి కాదని, పెట్రోల్‌ రేట్ల గురించని ఆయన చమత్కరించారు.

ఈ మేరకు కేటీఆర్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. అదేవిధంగా 2014లో రూ.70 గా ఉన్న పెట్రోల్‌ ధర 2024 నాటికి రూ.110 కు చేరిందని అంకెలతో సూచించారు. బీజేపీకి 400 సీట్లిస్తే 2029 నాటికి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.400 కు చేరుతుందేమోనని ఆ అంకెలతోనే అనుమానం వ్యక్తంచేశారు.

ఈ పోస్టుకు బీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం చేసిన యాడ్‌ను కేటీఆర్‌ జతచేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పెట్రోల్‌ ధర రూ.400 కు చేరుతుందన్నట్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌ను చేయించింది.

ANN TOP 10