AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్‌ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి లో విషాదం చోటు చేసుకుంది. వై జంక్షన్‌లోని చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్‌(Chennai silks shopping mall) పై నుంచి దూకి రమణమ్మ(50) అనే మహిళ (Woman) ఆత్మహత్య కు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు..రమణమ్మ షాపింగ్ మాలులో నాలుగు సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నది.

అయితే, సోమవారం 2వ ఫ్లోర్‌లో పని చేయాల్సి ఉండగా.. షాపింగ్ మాల్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన షాపింగ్‌ మాల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానని పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10