AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌వీ నేత శుభాకాంక్షలు

అమ్మన్యూస్‌, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్‌ శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఎన్‌ రాజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన రాజు కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి పత్యేకంగా అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. నవంబర్‌లో నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ANN TOP 10