టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం విశాఖపట్నంలో జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమిండియా జట్టుకు తొలి మ్యాచ్‌లో ఆటంకాం ఎదురైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో టీమిండియాపై గెలిచింది. ఇప్పుడు గెలుపు ఉత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంతో ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన జట్టును ప్రకటించింది.
బెన్ స్టోక్స్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. ఒక ఫాస్ట్ బౌలర్, ముగ్గురు స్పిన్నర్లతో ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. రెండు మార్పులు చేసిన ఇంగ్లాండ్ జట్టు.. సీనియర్ బౌలర్ జాక్ లిచ్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో స్పన్నర్ సోయబ్ బషీర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే మార్క్ వుడ్ స్థానంలో జేమ్స్ ఆండర్సన్ వచ్చాడు. టీమిండియాకు గాయం కారణంగా ఇద్దరు సీనియర్ ప్లేయర్లు దూరం అయ్యారు. కేఎల్ రాహుల్, రవీ చంద్రన్ అశ్వీన్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరం అయ్యారు. గాయాల కారణంగా టీమిండియా జట్టుకు ప్లేయర్లు దూరం అవుతుండగా.. రెండో టెస్టుకు ఎవరిని ఎంపిక చేస్తోందో ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లాండ్ తుది జట్టు: జక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (సి), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్









