AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన కేసీఆర్‌.. హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..

శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. నవంబర్‌లో నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే.

అయితే, ఆ సమయంలో ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో పడిపోగా.. తుంటికి గాయమైంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలోకి చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ANN TOP 10