AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బడ్జెట్ రూ. 47.66 లక్షల కోట్లు.. కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం

పన్ను పరిధి పెంపు
రూ. 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు
జీడీపీ అర్థం మార్చిన కేంద్రం
మధ్య తరగతి కోసం కొత్త హౌసింగ్ స్కీమ్

ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగించారు. వరుసగా ఆరోసారి ఆమె పద్దును ప్రవేశపెట్టి మొరార్జీ రికార్డును సమం చేశారు. మన్మోహన్‌, జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హా రికార్డును నిర్మల అధిగమించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ.. డిజిటల్‌ రూపంలో బడ్జెట్‌ కాపీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుందని అన్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందన్నారు. పదేళ్లలో మోడీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని వివరించారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడింది. సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలు ఆర్థిక వ్యవస్థలో చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధిని తీసుకెళ్లాయి. ఇంటింటికి విద్యుత్‌, ఇంటింటికి ఉపాధి, ఇంటింటికి తాగునీరు అన్నది సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయి. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారని, ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారన్నారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని చెప్పారు. సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలు ఆర్థిక వ్యవస్థలో చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధిని తీసుకెళ్లాయని, అలాగే ఇంటింటికి విద్యుత్‌, ఉపాధి, తాగునీరు అన్నది సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా 1.4 కోట్ల మంది యువతను ట్రైన్ చేశామన్నారు. 54 లక్షల మందికి పునశిక్షణ కల్పించామని తెలిపారు. 3 వేల కొత్త ఐటీఐలను ప్రారంభించామని, అలాగే 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 వర్సిటీలు ఇప్పుడు దేశంలో ఉన్నాయని చెప్పారు.

పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పరిమాణం రూ. 47.66 లక్షల కోట్లు. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు కేటాయించినట్లు వివరించారు.

బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులు

రక్షణ శాఖ – రూ. 6.2 లక్షల కోట్లు
రైల్వేశాఖ – 2.55 లక్షల కోట్లు
హోం శాఖ- 2. 03 లక్షల కోట్లు
వ్యవసాయం – 1. 27 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ – 1.77 లక్షల కోట్లు
జాతీయ రహదారులు – 2.78 లక్షల కోట్లు
ఆహారం, ప్రజా పంపిణీ – 2. 13 లక్షల కోట్లు
కమ్యూనికేషన్ రంగానికి రూ. 1. 13 లక్షల కోట్లు
ఎరువులు, రసాయనాలు రూ. 1. 68 లక్షల కోట్లు

బడ్జెట్‌లో వివిధ కేంద్ర పథకాలకు కేటాయింపులు

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 86 వేల కోట్లు
ఆయుష్మాన్‌ భారత్ పథకం రూ. 7, 500 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలు రూ. 6, 200 కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ రూ.6, 903 కోట్లు
సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8, 500 కోట్లు
గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ. 600 కోట్లు

ఉచిత విద్యుత్

విద్యుత్ బిల్లల నుంచి సామన్య ప్రజలకు ఊరట కలిగించేలా బడ్జెట్‌లో నూతన పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూఫ్ టాప్ పోలరైజేషన్ ద్వారా 1 కోటి గృహాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను అందిస్తామన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత మోడీ తీసుకున్న నిర్ణయమని ప్రకటించారు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.

ట్యాక్స్ లో మార్పు లేదు

మధ్యంతర బడ్జెట్ సామన్యుడికి ఊరట లభించింది. పన్నుల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పు లేదని తెలిపారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 3 రెట్లు పెరిగినట్లు ప్రకటించారు. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదని వెల్లడించింది. ఆదాయపన్ను చెల్లింపులను సులభతరం చేస్తామని, కార్పొరేట్ ట్యాక్స్ ను 30 నుంచి 22 శాతానికి తగ్గింపు ఉంటుందని వివరించారు. దేశంలో మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. మత్స్య రంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. యువత కోసం రూ. లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించామన్నారు. అదే విధంగా మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతుందని, కొత్త రోడ్, కారిడర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. వందే భారత్, నమో భారత్ రైల్వే వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నామని, అందుకోసం కొత్తగా మరో 1000 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అన్నదాతల కోసం రూ. 11.8 కోట్ల ఆర్థిక సాయం చేశామన్నారు. వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం కొత్త ఊపిరి నిచ్చిందని వివరించారు. జీడీపీ అర్థాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చింది. జీడీపీ అంటే ఇప్పుడు.. గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అని నిర్మలా సీతారామణ్ అన్నారు.

టూరిస్టూ హబ్‌గా లక్షదీప్

టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీపనే ప్రమోట్ చేయడానికి వడ్డీ లేని రుణాలు ఇప్పుడు ఇస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్‌ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. ప్రపంచంలో అత్యున్నత టూరిస్ట్ హబ్ లక్షద్వీప్ ని ప్రమోట్ చేయడానికి వడ్డీ లేని రుణాలు ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులను కల్పించబోతున్నట్లు చెప్పారు. టూరిస్ట్ హాబ్‌గా లక్షద్వీప్ అభివృద్ధికి మౌళిక వసతులు పెంపునకు కృషి చేస్తామని వివరించారు. పిల్లల ఆరోగ్యం కోసం ఇంధ్రధనుస్సు కార్యక్రమం తీసుకు వచ్చామన్నారు. యువతకు ముద్రా యోజనతో రూ.25 లక్షల కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. జీఎస్‌టీ వంటి ట్యాక్స్‌ సంస్కరణలు ట్యాక్స్‌ పరిధిని పెంచాయన్నారు. క్రీడల్లో సాధించిన పతకాలు యువతలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నాయని, మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ANN TOP 10