AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెరా కార్య‌ద‌ర్శి శివ‌బాల‌కృష్ణ‌పై స‌స్పెన్ష‌న్ వేటు

హైద‌రాబాద్ : రెరా కార్య‌ద‌ర్శి శివ‌బాల‌కృష్ణ‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. శివ‌బాల‌కృష్ణ‌ను స‌స్పెన్షన్‌పై హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌నర్ దాన కిశోర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవ‌ల శివ‌బాల‌కృష్ణ‌ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ప్ర‌స్తుతం ఆయ‌న చంచ‌ల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గ‌తంలో మెట్ర్ రైల్ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా ప‌ని చేశారు శివ బాల‌కృష్ణ‌. రెరా ఇంచార్జి కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశారు

శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను కనుగొన్నట్టు వెల్లడించారు. సోదాల్లో దొరికిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8,26,48,999 అని, బయటి మార్కెట్‌లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్‌ జరుగుతున్నదని వివరించారు. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్‌ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ANN TOP 10