AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. 65 మందిని కాపాడి హఠాన్మరణం..

భువనేశ్వర్‌: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అప్పుడు గనుక డ్రైవర్‌ స్టీరింగ్‌ విడిచిపెడితే ఆ బస్సులోని 65 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ ఆ డ్రైవర్‌ అలా చేయలేదు. బస్సును పక్కకు ఆపేసి ప్రాణాలు విడిచాడు. బస్సులోని 65 మంది ప్రాణాలు కాపాడాడు. ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లాలోని పటాపూర్ చక్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన పర్యాటకులు ఓ బస్సులో బాలాసోర్‌లోని పంచ లింగేశ్వరాలయం వైపు వెళ్తున్నారు. మరికాసేపట్లో ఆలయానికి చేరుకుంటామనగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో బస్సును పక్కకు ఆపి స్పృహ కోల్పోయాడు.

బస్సులోని ప్రయాణికులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించడా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతిచెందిన డ్రైవర్‌ను షేక్‌ అక్తర్‌గా గుర్తించారు. గుండెపోటు వచ్చినా అప్రమత్తంగా వ్యవహరించి డ్రైవర్‌ తమ ప్రాణాలు కాపాడాడని ఆ బస్సులోని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ANN TOP 10