AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు..!

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి స్థానిక మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు శిఖం భూమిలో కడుతున్న బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పనులను ఆపేయాలని అందులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొంపెల్లి శివారులో ఉన్న గొరంట్ల కుంట చెరువు శిఖానికి సంబంధించిన 209 సర్వే నంబర్​లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు‌‌‌‌‌‌‌ తీసుకోకుండా నిర్మిస్తున్న ఈ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పనులను ఆపేయాలని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్​నోటీసులో స్పష్టం చేశారు. వారం రోజుల్లో నోటీసుకు వివరణ ఇవ్వాలని, లేకపోతే తెలంగాణ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ 2019 సెక్షన్‌‌‌‌‌‌‌‌ 178(2), (8), 181ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా కడుతున్న భవనం‌‌‌‌‌‌‌ గోడలకు నోటీసులు అతికంచారు.

గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్న బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ స్థలం చెరువు శిఖం భూమి కావడంతో పాటు ఈ సర్వే నంబర్​లోని 22.38 గుంటల స్థలంపై ఇది వరకే హైకోర్టులో కేసు ఉందన భవనం ముందు హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. అయితే దీనిపై గండ్ర వెంకటరమణా రెడ్డి స్పందించలేదు. గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా నోటీసులు అందుకున్నారు. జీవన్‌ రెడ్డి భార్య లోన్ తీసుకుని కట్టలేదు. దీంతో రుణం చెల్లించాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.20 కోట్లు మొత్తం కలిపి రూ. 40 కోట్లు చెల్లించాలంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. జీవన్ రెడ్డి తన భార్య పేరు మీద 2017లో స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. ఈలోన్ కు సంబంధించి ఇప్పటి వరకు వడ్డీ కాని, అస్సలు కాని చెల్లించలేదు. అస్సలు ప్లస్‌ వడ్డీ కలిసి రూ.40 కోట్ల బకాయి ఉందని అధికారులు చెప్పారు. అటు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ బంధువుల రైస్ మిల్లుల్లో అధికారులు సోదాలు చేసి కేసులు నమోదు చేశారు.

ANN TOP 10