AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏసీబీ వలలో పరిశ్రమల అధికారి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చిరాం గత సంవత్సరం అశోక్ లేలాండ్ వాహనాన్ని రూ. 53 లక్షలకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి సబ్సిడీ కోసం జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్ లచ్చిరాం నుంచి మొదట రూ. 50 వేలు తీసుకున్నాడు. అనంతరం మళ్లీ రూ. 60,000 కావాలని డిమాండ్ చేయడంతో లచ్చిరం వరంగల్‌లోని ఏసీబీ కార్యాలయంలో సంప్రదించారు. దీంతో లచ్చిరం గురువారం రూ. 15000 జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్‌కు లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతన్ని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ANN TOP 10