కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరు గ్యారంటీల కార్డును రుద్రేశ్వరుని చెంత పెట్టి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. రామప్ప ఆలయ ప్రత్యేకతను రాహుల్, ప్రియంక అడిగి తెలుసుకున్నారు. ఆలయ స్తంభాలపై ఉన్న శిల్పకళను చూసి.. తన్మయత్వం పొందారు. అనంతరం.. తొలి విడత బస్సు యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు.










