బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి నివాసానికి బోథ్ ఎమ్మెల్యే బాపురావు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం పక్కనబెట్టేసి ఆ స్థానాన్ని అనిల్ జాదవ్‌కి కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ సారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి – ఉప్పల్, రాజయ్య – స్టేషన్ ఘనపూర్, రాములు నాయక్ – వైరా, రేఖా నాయక్ -ఖానాపూర్, చెన్నమనేని రమేష్ – వేములవాడ, గంప గోవర్ధన్ -కామారెడ్డి, రాథోడ్ బాపురావు -బోధ్, విద్యాసాగర్ రావు – కోరుట్లకు టికెట్లు దక్కలేదు. వీరిలో ప్రస్తుతం రేఖా నాయక్ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.









