వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కంగారూలు.. సోమవారం లక్నో వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించారు. తొలుత లంకను 209 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. ఆ తర్వాత విజయలక్ష్యాన్ని 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (51 బంతుల్లో52 , 9 ఫోర్లు)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (58 బంతుల్లో 58, 5 ఫోర్లు, 1 సిక్సర్), మార్నస్ లబూషేన్ (60 బంతుల్లో 40, 2 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. ఈ మెగాటోర్నీలో ఆసీస్‌కు ఇదే తొలి విజయం కాగా లంకకు హ్యాట్రిక్ ఓటమి.









