కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారడానికి సిగ్గుండాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా, మంత్రిగా పని చేశారు. ఇదేం తీరు? అని పొన్నాలపై ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉంటే ప్రజాసేవ చేస్తే ఎందుకు గెలవరు? అని పొన్నాలను ప్రశ్నించారు.
”పీసీసీగా ఉండి 40వేల ఓట్లతో ఓడిపోయారు. రెండోసారి ఇస్తే 50వేల ఓట్లతో ఓడిపోయారు. అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఏ కారణంతో ఆ చిల్లర కామెంట్ చేశారు. జనగాం టికెట్ పై ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశాం. అందులో పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. పార్టీని దెబ్బతీయడానికి, వీక్ చేయడానికి పొన్నాల ఈ నిర్ణయానికి వచ్చారు.
పొన్నాల లక్ష్మయ్య కార్యకర్తలకు క్షమాపణ చెప్పి బేషరతుగా రాజీనామాను ఉపసంహరించుకోవాలి. అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని ఎవరైనా అన్నం తినే వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కడే టికెట్లు ఇవ్వడు. ఒక ప్రాసెస్ ప్రకారం టికెట్లు ఇస్తాం. సీఈసీ అనేది కాంగ్రెస్ లో ముఖ్యమైనది. వాళ్లే టికెట్లు, అభ్యర్థులను ఖరారు చేస్తారు.









