AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొంతమంది పార్టీని వీడినా నష్టం లేదు: పువ్వాడ అజయ్‌ కుమార్‌

కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. తమ బలం కేసీఆరే అన్నారు. తనకు గ్రూప్‌ రాజకీయాలు ఇష్టం లేదన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే ముందుకు సాగుతామన్నారు. అభివృద్ధి మంత్రంతో తాము రానున్న ఎన్నికలకు వెళ్తామన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బీఆర్‌ఎస్‌ ఒకటే స్థానం పొందిందని, ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మెజార్టీ స్థానాలను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీని తన చేతుల మీదుగా విలీనం చేయడం గొప్పవరమన్నారు.

ANN TOP 10