AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్ నెగ్గిన రోహిత్ శర్మ.. స్టార్ బౌలర్ కు ఛాన్స్..

ఆసియా కప్ 2023 లో టీమిండియా మరో మ్యాచ్ కు సిద్ధమైంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ వర్షర్పాణం కావడంతో నేపాల్ తో జరిగే పోరులో భారీ విజయంతో బోణీ కొట్టాలనే పట్టేదల మీద ఉంది. సూపర్ 4కు ముందు ఈ మ్యాచ్ ను ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో రోహిత్ శర్మ అండ్ కో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా చెరో మార్పు చేసింది. ఈ మ్యాచ్ కు జస్ ప్రీత్ బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో మొహమ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత బౌలర్లు బౌలింగ్ చేయలదు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. దాంతో నేపాల్ తో జరిగే మ్యాచ్ లో భారత బౌలర్లకు ప్రాక్టీస్ కల్పించే కోణంలో టాస్ నెగ్గిన వెంటనే రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. టాస్ సమయంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో పిచ్ ను కవర్స్ తో కప్పేశారు.

ANN TOP 10