AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఈ మార్గాల్లో పలు ట్రైన్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి పలు ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్లలో మరమ్మతు పనుల కారణంగా ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. నేటి (సెప్టెంబర్ 4) నుంచి ఈనెల 10 వరకు పలు ట్రైన్లను పూర్తిగా, మరికొన్ని ట్రైన్లు పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

డోర్నకల్‌- విజయవాడ, విజయవాడ- డోర్నకల్‌, కాజీపేట-సిర్పూర్‌టౌన్‌, కాజీపేట- డోర్నకల్‌, డోర్నకల్‌- కాజీపేట, భద్రాచలంరోడ్‌- విజయవాడ, విజయవాడ- భద్రాచలంరోడ్‌, భద్రాచలంరోడ్‌- బల్లార్ష, సిర్పూర్‌టౌన్‌-భద్రాచలం రోడ్‌, వరంగల్‌- హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-వరంగల్‌, సిర్పూర్‌టౌన్‌- కరీంనగర్‌, కరీంనగర్‌- సిర్పూర్‌టౌన్‌, కరీంనగర్‌-నిజామాబాద్‌, నిజామాబాద్‌- కరీంనగర్‌, కాజీపేట- బల్లార్ష, బల్లార్ష- కాజీపేట ట్రైన్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్‌- పండరీపుర్‌, దౌండ్‌- నిజామాబాద్‌ ట్రైన్లను పాక్షికంగా రద్దుచేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా రద్దు..
హైదరాబాద్ పరిధిలో పలు ఎంఎంటీఎస్ ట్రైన్లను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి– ఫలక్‌నుమా, లింగంపల్లి– నాంపల్లి, ఉందానగర్‌– లింగంపల్లి, నాంపల్లి– లింగంపల్లి తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

ANN TOP 10