రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న కారు టైర్ పెద్ద శబ్దంతో బ్లాస్ట్ కావడం డివైడర్‌పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.









