AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెలవు ఇవ్వలేదని.. సూపర్‌ మార్కెట్‌కు నిప్పు

సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళా ఉద్యోగి తాను పనిచేస్తున్న సూపర్‌ మార్కెట్‌కు నిప్పుపెట్టింది. మహారాష్ట్రలోని భాయందర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. సెలవు మంజూరు చేయాలని రెండుసార్లు అభ్యర్థించినా అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఉద్యోగిని గురువారం మధ్యాహ్నం సూపర్‌మార్కెట్‌లో బొమ్మలు, దుస్తులు ఉంచిన ప్రాంతానికి నిప్పుపెట్టింది. అప్రమత్తమైన సహచర ఉద్యోగులు మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితురాలిని గుర్తించారు. లీవ్‌ మంజూరు చేయకపోవడం, షిప్ట్‌ టైమింగ్స్‌పై అసంతృప్తి కారణంగానే ఆ మహిళ ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

ANN TOP 10