AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?.. ఒక మహానటుడి కుమార్తె!

ట్విట్టర్‌లో ఈ ఫొటోను షేర్‌ చేసిన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ
ప్రస్తుతం మనం చూసే సినీ, రాజకీయ ప్రముఖులు ఒకప్పుడు అంటే వారు యవ్వనంలోనో, నడి వయస్సులోనో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో చూస్తే ఆ ఫీలింగ్‌ చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అంతెందుకు మన అమ్మానాన్నలు, అత్తామామలు లేదంటే తాతయ్య బామ్మల పాత ఫొటోలు చూసినా, పెళ్లి ఫొటోలు చూసినా మనకు తెలియకుండానే మనలో ఏదో లైటింగ్‌ వస్తుంది.

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి. ఇది చంద్రబాబు, భువనేశ్వరి పెళ్లి నాటి ఫొటో. ఈ ఫొటోలో నారా భువనేశ్వరి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం మనం చూసే భువనేశ్వరికి, ఈ ఫొటోలో భువనేశ్వరికి అస్సలు సంబంధం లేనట్టుగా ఉంది. ఫొటోలో ఆమె బొద్దుగా గుండ్రని మొహంతో కనిపిస్తున్నారు. కానీ, ఇప్పుడు బాగా సన్నగా ఉన్నారు. తీక్షణంగా చూస్తే ప్రస్తుతం నారా లోకేష్‌ ఎలా ఉన్నారో.. అప్పుడు భువనేశ్వరి అచ్చం అలానే ఉన్నారు. ఇద్దరి పోలికలు ఒకేలా ఉన్నాయి.

ANN TOP 10