AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ టూ యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్లు!

త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
భక్తుల డిమాండ్ మేరకు హైదరాబాద్ నుంచి యాదాద్రికి MMTS ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆ పనులు పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకుంది.

MMTS ట్రైన్లు రాయగిరి (యాదాద్రి) స్టేషన్‌ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్‌ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వంరూ. 330 కోట్లు నిధులు ఖర్చు పెడుతోందని చెప్పారు. ఘట్కేసర్- రాయగిరి రైల్వేలైన్ పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం అయ్యే పూర్తి ఖర్చును కూడా కేంద్రమే భరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్‌ రెండోదశ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. ఇప్పటికే మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు లైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నుంచి జస్ట్ రూ.20 టిక్కెట్‌తో యాదాద్రికి వెళ్లే అవకాశం లభిస్తుంది.

ANN TOP 10