AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో పాతబస్తీలోనూ పరుగులు పెట్టనున్న మెట్రో

మొట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్ల మార్గాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. అయితే, పాతబస్తీలో ప్రాజెక్టుకు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యాయి. సుమారు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోపనులు ముందుకు కదలలేదు. మెట్రో కోసం పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

మరో మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించినా పరిస్థితిలో పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మున్సిపల్ అధికారులు, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌తో మాట్లాడారు. మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు సీఎం చెప్పినట్టు కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమాతో పాటూ రాయదుర్గం రూట్‌లోని పలు ప్రాంతాల్లో 2.7 కిలోమీటర్ల మేర మిగిలిపోయిన నిర్మాణపనులను పూర్తి చేస్తే నగర వాసులకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.

ANN TOP 10