ఇన్నాళ్లు చెట్లు, గుట్టలు అంటూ అడవుల్లో తిరిగిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.. ఇప్పుడు ఏడు సముద్రాలు దాటి అమెరికాకు వెళ్లారు. అమెరికాలో నిర్వహిస్తున్న 23వ తానా మహాసభలకు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. కాగా.. సీతక్కను హీరో బాలకృష్ణ సన్మానించారు. అయితే.. కార్యక్రమానికి వచ్చిన తెలుగు వాళ్లంతా సీతక్కతో ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఎంతో ఓపికతో సీతక్క అందరికీ ఫొటోలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి ప్రముఖులు హాజరయ్యారు.










