AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెండున్నరేళ్ల కుమారుడికి ఉరేసిన తల్లి.. ఆ తర్వాత..

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో దారుణం
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో విషాదకరఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా కుమారుడికి ఉరేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విశ్వనాథ్, శిరీష దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు మనీష్ ఉన్నాడు.

అయితే గతకొంత కాలంగా శిరీషను అత్తింటివారు వేధిస్తున్నట్లు సమాచారం. వారి వేధింపులు తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గత రాత్రి (జూన్ 23) ముందుగా ఉరేసింది. ఆ తర్వాత తాను కూడా ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలంచి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిరీష ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ అని తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ANN TOP 10