కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఆయనతో పలువురు నాయకులు భేటీ అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయన అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న నాయకులను కాంగ్రెస్‌వైపు మళ్లించేందుకు కోదండరాం కృషి ప్రారంభించారు.
ఇప్పటికే మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన ఆయన…. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుతోనూ చర్చించారు. ఇప్పటికే వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వెల్లడించారు. కమలం, కారు పార్టీలకు చెందిన చాలా మంది నేతలతో కోదండరాంకు సన్నిహిత ఉన్న నేపథ్యంలో ఆయన మాటకు విలువనిచ్చే నేతలు ఉన్నారు.
వారందరితో కోదండరాం మాట్లాడుతున్నట్టు ఆ పార్టీలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు అవసరమైతే టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటూ సూర్యాపేటలో నిర్వహించిన ప్లీనరీలో ప్రకటించిన కోదండ రాం.. అందుకనుగుణం గానే కాంగ్రెస్‌కు చేరువవుతు న్నట్టు తెలుస్తోంది. విలీనం చేసేందుకు సిద్ధమవు తున్నట్టు తెలుస్తోంది. ఈ లోపుగా పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఆయన రంగంలోకి దిగినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.









