AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు నగరంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) శనివారం నగరంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో జరుగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రీవ్యూయింగ్‌ ఆఫీసర్‌గా రాష్ట్ర‌ప‌తి హాజరవుతారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆమె తిరిగి ఢిల్లీకి వెళతారు.

కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్బంగా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎంతో పాటు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాత్రి ఆమె అక్కడే బస చేశారు.

ANN TOP 10