AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరుస ఆత్మహత్యలపై గవర్నర్ ఆవేదన

హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటిలో వరుస ఆత్మహత్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ కు గవర్నర్ సూచించారు. 48 గంటల్లోనే సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. విద్యార్థుల సమస్యలు పరిస్కరించేందుకు కృషి చేయాలన్నారు. దురదృష్టకర ఘటనల నివారణకు చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని వెల్లడించారు. విద్యార్థులు తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని గవర్నర్ తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10