AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడో రోజు ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్..

బయటపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ గుట్టు
హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మూడో రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లు, ఆఫీసులు, సంస్థల్లో జరుగుతున్న సోదాలు సంచలనం రేపుతోన్నాయి. ఈ క్రమంలో మూడో రోజు జరుగుతున్న ఐటీ తనిఖీల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లైఫ్ స్టైల్ యజమాని గజ్జల మధుసూదన్ రెడ్డి నివాసంలో కూడా ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారుల తనిఖీలు చేపడుతున్నారు. ఆయన వివిధ వ్యక్తులకు అమ్మిన భూమి వ్యవహారమే సోదాలకు కారణంగా తెలుస్తోంది.

హైదరాబాద్ శివారులో వేల ఎకరాలను భూమిని మధుసూదన్ రెడ్డి అమ్మినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని తీసుకుని రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మాడు. ఈ భూమిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పైళ్ల శేఖర్ రెడ్డి ,కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డితో కలిసి మధుసూదన్ రెడ్డి వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. వారికి మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మధుసూధన్ రెడ్డి, భార్య, కుమారుడిని కూడా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల రాజశేఖర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో సహా మధుసూధన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు, కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. నలుగురి మధ్య ఉన్న రియల్ ఎస్టేట్ భాగస్వామ్య వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇటీవలికాలంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మధుసూధన్ రెడ్డి జరిపిన లావాదేవీలపై విచారణ చేపడుతున్నారు.

హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలతో జరిగిన ఒప్పందాలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ సిండికేట్‌పై లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి బిజినెస్‌లు చేస్తున్న వ్యక్తులపై మరికొంతమంది వ్యక్తలుపై కూడా దృష్టి పెట్టారు.

ANN TOP 10