AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్‌లో ఆగని హింస

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగటం లేదు. నిరసనకారులు కొందరు అంబులెన్సుకు నిప్పుపెట్టడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఆందోళనలకు అడ్డుకట్ట వేయటంలో విఫలమవుతున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నాయకులు, సామాజికవేత్తలు, పౌర సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. 2000 మంది మెయిటీ గ్రూపు ఇంఫాల్‌ శివార్లలో పోలీసుల ముందు అంబులెన్సును తగలబెట్టింది. బుల్లెట్‌ గాయాలతో ఆస్పత్రికి తరలించబడుతున్న తరుణంలో ఏడేండ్ల బాలుడు, తల్లి, వారి బంధువు సజీవ దహనమయ్యారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

అనేక మంది కుకీలు బస చేసిన అస్సాం రైఫిల్స్‌ క్యాంపులోనే వారు ఆశ్రయం పొందుతున్నారు. ఇది (క్యాంపు) ఇంఫాల్‌కు పశ్చిమాన 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌చుప్‌లో ఉన్నది. అయితే నిరసనకారులు జరిపిన కాల్పుల్లో టోన్సింగ్‌కు బుల్లెట్‌ గాయమైంది. దీంతో పోలీసుల భద్రత నడుమ అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో మెయిటీ గ్రూపు వాహనాన్ని అడ్డుకున్నది. నిప్పంటించి దారుణానికి తెగబడింది.

ANN TOP 10