AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొత్త సచివాలయంలో పది రోజులుగా చోరీలు

తెలంగాణ కొత్త సచివాలయంలో దొంగలు పడ్డారు. అంత పెద్ద సెక్రటేరియట్‌కు సెక్యూరిటీ గట్టిగానే ఉంటుంది కదా దొంగలు ఎలా వచ్చారబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్.. ఈ తతంగం వారం, పదిరోజులుగా ఇదే తంతట. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాధికారులు ఎందుకు అలర్ట్ కావట్లేదు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ దొంగలు ఏం ఎత్తుకెళ్లారు..? సచివాలయంలో ఏ బ్లాక్‌లో దొంగతనం జరిగింది..? అనే విషయాలు తెలుసుకుందాం..!

అసలేం జరిగిందంటే..?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త సెక్రటేరియట్‌ నిర్మించింది కానీ.. దొంగలు పడకుండా ఆపలేకపోయింది..!. సచివాలయం పక్కన మీడియా సెంటర్‌లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వర్క్ నడుస్తున్నంత సేపు అక్కడ సిబ్బంది ఉంటున్నారు కానీ.. ఆ తర్వాత ఎవరూ ఆ ప్రదేశంలో అడ్రస్ కనిపించరు. దీన్నే అదనుగా చేసుకున్న దొంగలు ఈ ప్రదేశంలోకి చొరబడ్డారు. ఒకరా ఇద్దరు కాదు ఏకంగా ఐదారుగురు మీడియా సెంటర్‌లోకి వచ్చి దొరికినవన్నీ ఎత్తుకెళ్లారు. ఇలా జరగడం ఇవాళేం కొత్తేం కాదట. నిత్యం ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే.. మీడియాకు తెలియకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ వేల రూపాయిలు విలువ చేసే కరెంటు వైర్లు, రాడ్లు, స్విచ్ బోర్డులు, ఎల్ఈడీ లైట్లు ఎత్తుకెళ్లారు. నిన్న ఒక్కరోజే పదివేలకు పైగా విలువ చేసే సామాగ్రి అపహరణకు గురికావడం గమనార్హం. అయితే ఇదొక్క చోటే కాదు.. కొత్తగా నిర్మిస్తున్న అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద కూడా ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ ఏం ఎత్తుకెళ్లారో అనే విషయం అధికారులు బయటికి పొక్కనీయట్లేదు.

ANN TOP 10