గుండెపోటుతో భక్తురాలు మృతి
వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం రోజున రాజన్న ఆలయానికి వచ్చింది, అయితే సోమవారం ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనం చేసుకోవటం కుదరలేదు. దీంతో మరుసటి రోజు స్వామివారిని దర్శించుకోవచ్చునని ఆలయంలోనే నిద్రించింది.
మరుసటి రోజు అంటే జూన్ 06 మంగళవారం రోజున దర్శనం కోసం కుటుంబంతో కలిసి బయల్దేరింది లక్ష్మి . క్యూ లైన్‌లో నిలుచున్న లక్ష్మి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు ఏం అయిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది, వైద్యులు వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందినట్లుగా వెల్లడించారు.









