AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని దిగ్భ్రాంతి

రష్యా, ఆస్ట్రేలియా సంతాపం
ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్‌ ట్రుడో ఒక ట్వీట్‌ చేశారు.

అలాగే తైవాన్‌ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్‌ వెన్‌ కూడా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు రష్యా అంబాసిడర్‌ డెనిస్‌ అలిపొవ్‌ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ANN TOP 10