పాల్గొన్న రేవంత్‌రెడ్డి, కంది శ్రీనన్న
అమెరికాలోని న్యూ జెర్సీ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, కంది శ్రీనన్న మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు.










